Sunday, January 19, 2025
HomeTrending NewsAP High Court: అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

AP High Court: అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్

జీవో నంబర్ 45ను సవాల్ చేస్తూ  దాఖలైన పిటిషన్ ను ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కొట్టి వేసింది. రాజ‌ధాని ప్రాంతంలో వేలాది మంది   పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాల‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. రాజ‌ధాని ఏ ఒక్క వ‌ర్గానికో చెందింది కాద‌ని, అంద‌రిదీ అని , అభిప్రాయపడింది. పేద‌ల‌కు ఇంటి స్థ‌లాలు ఇచ్చేందుకు హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అయితే ఇళ్ళ పట్టాల పంపిణీ గతంలో సిఆర్దీఏ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు లోబడి ఉండాలని పేర్కొంది.

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు (550.65ఎకరాలు), ఎన్టీఆర్‌ (583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూబదలాయింపు నిమిత్తం సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈఏడాది మార్చి 31న జీవో 45 జారీచేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు యు.శివయ్య, కె.రాజేశ్‌, బెజవాడ రమేశ్‌బాబు, ఆలూరి రాజేశ్‌, కుర్రా బ్రహ్మ, కట్టా రాజేంద్రవరప్రసాద్‌ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.  మొన్న బుధవారం  అమరావతి రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది.  ఆయా పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళ, బుధవారాల్లో విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్‌ చేసి నేడు వెలువరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్