Sunday, January 19, 2025
HomeTrending NewsChandrababu: హైకోర్టులో చుక్కెదురు: బెయిల్ పిటిషన్స్ డిస్మిస్

Chandrababu: హైకోర్టులో చుక్కెదురు: బెయిల్ పిటిషన్స్ డిస్మిస్

చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. అంగళ్లు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో డీమ్డ్ కస్టడీగా పరిగణిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని, ఫైబర్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని  బాబు తరఫు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మూడు కేసుల్లో చంద్రబాబు తరఫు న్యాయవాదులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగిశాయి.  ఈ కేసులను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను నేటికి రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.

పిటి వారెంట్ జారీ చేయకుండానే డీమ్డ్ కస్టడీ గా పరిగణిస్తూ బెయిల్ ఇవ్వాలని కోరడం సరికాదన్న సాంకేతిక అంశం కారణంగానే అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో బాబు పిటిషన్ డిస్మిస్ చేశారని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్