Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్దేవినేని ఉమాకు బెయిల్

దేవినేని ఉమాకు బెయిల్

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఘర్షణల్లో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదు కాబట్టి  307 సెక్షన్ వర్తించదని, ఆ సమయంలో స్వల్పంగా గాయపడ్డ కారు డ్రైవర్ కులం ఏమిటో ఉమాకు ఎలా తెలుస్తుందని ఉమా తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.

ఈ కేసులో మరికొంతమందిని అరెస్టు చేసి విచారించాల్సి ఉందని, అందువల్ల ఉమాకు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఉమాను పోలీసు కస్టడీకి కోరుతూ కృష్ణాజిల్లా పోలీసులు మచిలీపట్టణం ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం ఉమాకు బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ పరిశీలించడానికి దేవినేని ఉమా ఆ ప్రాంతానికి వెళ్ళారు. తిరిగి వస్తుండగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉమా బృందాన్ని అడ్డగించారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తి ఘర్షణలకు దారి తీసింది.  ఈ నేపథ్యంలో దేవినేనిపై ఎస్సీ, ఎస్టీ అత్రాసితీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. నూజివీడు కోర్టు ఉమాకు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్