Thursday, May 8, 2025
HomeTrending Newsమానవత్వమే సిఎం జగన్ మతం: సుచరిత

మానవత్వమే సిఎం జగన్ మతం: సుచరిత

మానవత్వమే సీఎం జగన్ మోహన్ రెడ్డి మతమని, ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి మానవతా దృక్పథంతో సాయం చేస్తే, చేతులు దులుపుకున్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం దారుణమని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు పైసా సాయం చేయని చంద్రబాబు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర  కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.

మేకతోటి సుచరిత మీడియా సమావేశంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు:

  • దిశ చట్టం ఇంకా అమలులోకి రాకపోయినా రోజుల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి, శిక్షలు పడేలా చేస్తున్నాం
  • మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం
  • పక్కరాష్ట్రంలో జరిగిన ఘటనతో మహిళల భద్రత కోసం ‘దిశ’ తెచ్చాం
  • ఏపీ దిశ చట్టం దేశంలోని పలు రాష్ట్రాలకు మార్గదర్శకమైంది
  • దిశ యాప్‌ జాతీయ స్థాయిలో 5 అవార్డులు గెలుచుకుంది
  • బాబు హయాంలో వనజాక్షి నుంచి కాల్ మనీ నేరాల వరకు ఏ రకంగా భద్రత కల్పించారో చూశాం
  • జగన్‌  పాలనలో ఎస్సీ, ఎస్టీలు ఎంతగానో గౌరవాన్ని పొందుతున్నారు
  • దిశ చట్టం ఎక్కడ ఉందని ప్రతిపక్షాలు మాట్లాడటం సిగ్గుచేటు
  • దిశ చట్టం ఇంకా అమలులోకి రానప్పటికీ, ఆ చట్టాన్ని అనుసరించే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులపై రోజుల్లోనే విచారణ పూర్తి చేసి,  త్వరితగతిన శిక్షలు పడే విధంగా చేస్తున్నాం
  • మహిళా భద్రత విషయంలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుంది
  • నారా లోకేష్‌ పరామర్శల పేరుతో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు.
  • బాధితురాలి కుటుంబీకులను ఇంటికి వెళ్లి పరామర్శించే అవకాశం ఉన్నా, ప్రభుత్వాసుపత్రి వద్ద మృతదేహాన్ని కదలనివ్వకుండా తన  పార్టీ నేతలను ప్రోత్సహించి హంగామా చేయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు అంతా గమనించారు.
  • సామాజిక మాధ్యమాల్లో అపరిచితులు పరిచయం అయినప్పుడు మహిళలు, విద్యార్థినులు, ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి.
  • ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకు గానీ, లేకుంటే దిశ యాప్‌ ద్వారానైనా పోలీసుల దృష్టికి తీసుకురావాలి.
  • టెక్నాలజీని ఎంతవరకూ వాడుకోవాలో అంతవరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది.  దాన్ని దుర్వినియోగం చేయకూడదు.
  • సోషల్‌ మీడియాను ఉపయోగించుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.
  • టెక్నాలజీ పెరిగేకొద్దీ నాణేనికి అటూ, ఇటూలా మంచితోపాటు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
  • చాలాచోట్ల మద్యంతో పాటు, మాదక ద్రవ్యాల వినియోగం కనిపిస్తోంది.
  • రమ్య కేసులో నిందితుడు శశికృష్ణ విషయంలో కూడా మాదక ద్రవ్యాల వినియోగం దిశగా విచారణ జరుగుతోంది.

విద్యార్థుల్లో సామాజిక చైతన్యం, స్పృహ కల్పించే విధంగా.. మరోవైపు విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారని సుచరిత వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్