Saturday, April 26, 2025
HomeTrending Newsఫోన్ ట్యాపింగ్ ఎక్కడా లేదు: జయరాం

ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా లేదు: జయరాం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి, ఫ్యాక్టరీస్ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. ఆదివారం కదిరి పట్టణంలో నూతన పట్టణ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ, జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తో పాటు మంత్రిజయరామ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న ప్రతి గ్రామంలో ప్రజలకు మేలు చేసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారిని అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారని అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడా లేదన్నారు. నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్రకు ఆదరణ లేదని, జనం తక్కువగా వస్తున్నారన్నారు. లోకేష్ కు పాదయాత్ర తరం కాదన్నారు.

Also Read : ఇది మ్యాన్ ట్యాపింగ్ : మంత్రి కాకాణి

RELATED ARTICLES

Most Popular

న్యూస్