Friday, March 29, 2024
HomeTrending Newsఅసెంబ్లీ ఏర్పాట్లపై ఛైర్మన్, స్పీకర్ సమీక్ష

అసెంబ్లీ ఏర్పాట్లపై ఛైర్మన్, స్పీకర్ సమీక్ష

Review: సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలను సెషన్స్ పూర్తయ్యే లోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశించారు, సమావేశాలు ప్రశాంతా వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అదికారులకు సూచించారు.  ఆంధ్రప్రదేశ్ శాసన సభ కమిటీ హాల్ లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ఛైర్మన్, స్పీకర్ పాల్గొని ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్, స్పీకర్ చేసిన సూచనలు:

  • గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో పలు ప్రశ్నలకు సమాదానాలు అందజేయాలి
  • గత ప్రశ్నల్లో పాఠశాల విద్య, ఆర్థిక శాఖకు సంబందించినవి ఎక్కుగా పెండింగ్ లో ఉన్నాయి
  • సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక  లైజనింగ్ అధికారిని నియమించాలి
  • ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందో బస్తు ఏర్పాట్లను చేయాలి
  • ప్రజల యావత్ దృష్టి  అసెంబ్లీ సమావేశాలపై ఉంటుంది
  • వాటికి ఎంతో ప్రత్యేక ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలి
  • సభ్యుల గౌరవాన్ని కాపాడటంలోనే మన గౌరవం ముడిపడిఉందనే అంశాన్ని అధికారులు అందరూ గుర్తించాలి
  • శాంతి భద్రతల విషయంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ గ్యాప్ లు ఉన్నాయే వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,  రాష్ట్ర డి.జి.పి. కె.రాజేంద్రనాద్ రెడ్డి, శాసన సభ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యలు, డెప్యూటీ సెక్రెటరీ ఎం.విజయ రాజు, శాసన మండలి ఓ.ఎస్.డి. కె.సత్యనారాయణరావు తదితరులతో పాటు పలు శాఖ  ప్రిన్సిఫల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు   ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్