Sunday, June 14, 2026
HomeTrending Newsఏపీ భవన్ లో ‘ఆంధ్ర మామిడి పళ్ళు'

ఏపీ భవన్ లో ‘ఆంధ్ర మామిడి పళ్ళు’

Mango shop:  ఢిల్లీ ఏ.పీ భవన్ ప్రాంగణం లో యూనియన్ బ్యాంక్ ఏ.టీ.యం పక్కన ఉన్న షాప్ నెం.1 లో ఏ.పీ మార్కఫెడ్ వారి ఆంధ్ర మామిడి పళ్ల షాప్ ను ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ప్రారంభించి అయన చేతుల మీదుగా కొందరికి విక్రయాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాశ్  మాట్లాడుతూ ఆంధ్ర నుంచి వచ్చే మామిడి పళ్లను ఢిల్లీలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.

ఈ దుకాణం ప్రతి రోజు ఉదయం 10 గం నుండి రాత్రి 8 గం వరకు పనిచేస్తుందని దుకాణం నిర్వాహకులు తెలిపారు. మార్కఫెడ్ వారి నుండి అన్ని రకాల ఆంధ్ర మామిడి పళ్ళు విక్రయిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో ఏ.పీ భవన్ ఉద్యోగస్తులు, ఉద్యోగుల వసతి గృహాలలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular