AP Mlc Elections For 14 Seats :
రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల జాతర మొదలైంది. ఎమ్మెల్యే నియోజకవర్గాల నుంచి ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు నేడు నోటిఫికేషన్ విడుదల కాగా నేడు మరో 11స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేసింది. దీనితో మొత్తం 14 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 14 లోగా జరగనున్నాయి.
వీటిలో ప్రకాశం, అనంతపురం, గుంటూరు స్థానిక సంస్థల నియోజకవర్గాలనుంచి ఎన్నికైన సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పయ్యావుల కేశవ్, అన్నం సతీష్ ప్రభాకర్ ల రాజీనామాలతో ఖాళీలు ఏర్పడ్డాయి. మాగుంట ఎంపీగా, పయ్యావుల ఎమ్మెల్యేగా ఎన్నికైనందున…. టిడిపితో విభేదించి అన్నం సతీష్ ప్రభాకర్ తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలూ జూన్ 04, 2019 లోనే ఖాళీ అయ్యాయి, అయితే ఆయా జిల్లాల్లో స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో వీటిని ఇప్పటివరకూ భర్తీ చేయలేకపోయారు.
మిగిలిన 8 స్థానాల్లో వివిధ జిల్లాల స్థానిక సంస్థల నుంచి
బుద్ధా వెంకన్న, యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ (కృష్ణా జిలా)
రెడ్డి సుబ్రహ్మణ్యం (తూర్పు గోదావరి)
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు)
ద్వారంపూడి జగదీశ్వర రావు (విజయనగరం)
బుద్దా నాగ జగదీశ్వర రావు, పప్పల చలపతి రావు (విశాఖ పట్నం)
గాలి సరస్వతి (చిత్తూరు) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పదవీ కాలం 2021, ఆగస్ట్ 10 నాటికి పూర్తయ్యింది.
ఈ 11 స్థానాలకు నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుంది, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనున్నాయి.
ఇంతకుముందు ప్రకటించిన మూడు ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పోలింగ్ అవసరమైనట్లయితే… నవంబర్ 29న పోలింగ్, అదేరోజు కౌంటింగ్ జరగనుంది. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ 14 స్థానాలూ అధికార వైఎస్సార్సీపీకే దక్కనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మండలిలో వైఎస్సార్సీపీ బలం 33కు పెరుగుతుంది.
Also Read :https://idhatri.com/election-commission-of-india-issued-schedule-for-ap-mlc-elections-for-3-seats/