గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు రేపు జూలై 21 నుంచే అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకూ అవలంబించిన రిజిస్టర్ విధానానికి స్వస్తి పలుకుతూ రేపటి నుంచి ఉద్యోగులు అందరు సమయానికి విదులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
సచివాయలాల్లో బయో మెట్రిక్ విధానం అమలు చేస్తారు, ఉద్యోగులంతా వారు పని చేస్తున్న సచివాలయ పరిధిలోనే నివాసం ఉండాలని పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు మరింత అందుబాటులో ఉద్యోగులు ఉండాలని, ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని ప్రభుత్వం పేర్కొంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.