Sunday, September 8, 2024
HomeTrending Newsమిగిలిన ‘పుర’పోరుకు షెడ్యూల్

మిగిలిన ‘పుర’పోరుకు షెడ్యూల్

Ap State Election Commission Released Schedule For Local Urban Body Elections :

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న, పెండింగ్ లో ఉన్న పంచాయతీ, స్థానిక, పురపాలిక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

పంచాయతీలు, వార్డులకు నవంబర్ 14న;

నెల్లూరు కార్పోరేషన్, 12  మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, ఖాళీగా ఉన్న వార్డులు, డివిజన్లకు నవంబర్ 15 న

ఎంపీటీసీలు, జడ్పీటీసీ లకు నవంబర్ 16న  ఎన్నికలు జరగనున్నాయి.

నెల్లూరు కార్పొరేషన్ సహా జిల్లాల వారీగా మరో 12 మున్సిపాలిటీ, నగర పంచాయతీలు… ఆకివీడు (తూర్పు గోదావరి); కొండపల్లి, జగ్గయ్యపేట (కృష్ణా); దాచేపల్లి, గురజాల (గుంటూరు), దర్శి (ప్రకాశం); బుచ్చిరెడ్డిపాలెం (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు); కుప్పం (చిత్తూరు); బేతంచెర్ల (కర్నూలు); కమలాపురం, రాజంపేట (వైఎస్సార్ కడప); పెనుకొండ (అనంతపురం) ఎన్నికలు నిర్వహిస్తారు. దీనితో పాటుగా వివిధ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న, వార్డులు, డివిజన్లకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సహానీ ప్రకటించారు.

షెడ్యూల్:

నోటిఫికేషన్                                            :       3 నవంబర్ , 2121
నామినేషన్ల దాఖలుకు చివరి తేది            :       5 నవంబర్, 2021
నామినేషన్ల పరిశీలన                              :       6 నవంబర్, 2021
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది    :       8 నవంబర్, 2021
అభ్యర్ధుల తుది జాబితా ప్రకటన               :       8 నవంబర్, 2021
పోలింగ్ తేదీ (పంచాయతీలు)                  :       14 నవంబర్, 2021
పోలింగ్ తేదీ (మున్సిపాలిటీలు)               :       15 నవంబర్, 2021
పోలింగ్ తేదీ (జడ్పీటీసీ, ఎంపీటీసీలు)      :        15 నవంబర్, 2021
కౌంటింగ్ (పంచాయతీలు)                      :        14 నవంబర్, 2021
కౌంటింగ్ (మున్సిపాలిటీలు)                   :        17 నవంబర్, 2021
కౌంటింగ్ (జడ్పీటీసీ, ఎంపీటీసీలు)          :        18 నవంబర్, 2021

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్