గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023 రెండవ రోజు సమావేశాలు మొదలయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జి. కిషన్ రెడ్డి, పోర్టులు, జల రవాణా శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్, పారిశ్రామిక వేత్తలు సుచిత్రా ఎల్లా (భారత్ బయోటెక్), గజానన్ నాబార్ (నోవా ఎయిర్); చావా సత్యనారాయణ (లార్స్ లాబ్స్); బండి వంశీ కృష్ణ (హెటేరో గ్రూప్); శాంతానన్ (సెయింట్ గోబైన్); సెర్గియో లీ (అపాచీ) తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖా డైరెక్టర్ సృజన కొన్ని కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అనంతరం సిఎం, కేంద్ర మంత్రుల సమక్షంలో మరికొన్ని ఒప్పందాలు కుదిరాయి.
Also Read: గ్లోబల్ సదస్సు ప్రారంభం