Sunday, September 8, 2024
HomeTrending NewsUPSC పరీక్షలకు ఆన్ లైన్ కోచింగ్

UPSC పరీక్షలకు ఆన్ లైన్ కోచింగ్

తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖచే  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు – 2022 కొరకు తెలంగాణ రాష్ట్ర  యస్.టి,యస్.సి, బి.సి అభ్యర్ధులకు శిక్షణ  ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల గిరిజన IAS స్టడీ సర్కిల్ ద్వారా (9) నెలలు ఆన్లైన్  పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్  శిక్షణ ఉంటుంది. అర్హులైన  తెలంగాణ రాష్ట్ర యస్.టి, యస్.సి, బి.సి అభ్యర్ధుల నుండి  ఆన్ లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి.  అభ్యర్ధులను ఆబ్జెక్టివ్ టైపు, వ్రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), ఆప్టిట్యూడ్ పరీక్ష  ద్వారా ఎంపిక చేయబడును.  దరఖాస్తు  చేసుకునే అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించరాదు. అభ్యర్థులు http://studycircle.cgg.gov.in లో లాగిన్ అయ్యి తేది: 23.09.2021 నుండి 17.10.2021 వరకు ఆన్ లైన్  ద్వారా మాత్రమే  రిజిస్ట్రేషన్ చేసుకొవాలి.  ఆన్ లైన్ అప్లికేషన్  మరియు సూచనలు  http://studycircle.cgg.gov.in మరియు http://twd.telangana.gov.in వెబ్ సైట్  లో అందుబాటులో కలవు. మరిన్ని వివరాలకు ఫోన్ 6281766534 నంబరును అన్ని పని దినాలలో ఉ// 10:30 నుండి సా// 5:00 లోపు సంప్రదించవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్