Saturday, January 18, 2025
Homeసినిమాఆకాశ్ కి అలాంటి రోజు రావడం ఖాయం:  అర్చన

ఆకాశ్ కి అలాంటి రోజు రావడం ఖాయం:  అర్చన

Akash-Future: 1980లలో తెలుగుతెరకు పరిచయమైన కథానాయికలలో ‘అర్చన’ ఒకరు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో ఆమె నటించారు. గ్లామరస్ హీరోయిన్ గా కాకుండా నటన ప్రధానమైన పాత్రల ద్వారా ఆమె  ప్రేక్షకులకు చేరువయ్యారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలతోను .. ఉద్యమ పూరితమైన పాత్రలతోను ఆకట్టుకున్నారు. ఆమె నటన లోని సహజత్వం ప్రేక్షకులను కట్టిపడేసింది. కళ్లతోనే ఆమె పలికించే హావభావాలకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.

తెలుగులో ఆమె నటించిన సినిమాలలో ‘నిరీక్షణ’ .. ‘లేడీస్ టైలర్’ .. ‘దాసి’ .. ‘భారత్ బంద్’  ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. కారణమేదైనా ఆ తరువాత ఆమె ఇక్కడి తెరపై కనిపించలేదు. తెలుగులో ఆమె ఒక్క సినిమా కూడా చేయక పాతికేళ్లకు పైనే అయింది. మళ్లీ ఇంతకాలానికి ఆమె  ‘చోర్ బజార్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆకాశ్ పూరి – గెహనా సిప్పీ జంటగా నటించగా, ఒక కీలకమైన పాత్రలో అర్చన కనిపించనున్నారు. ఆ పాత్ర  ప్రత్యేకత ఏమిటనేది చూడాలి మరి.

ఈ నెల 24వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అర్చన మాట్లాడుతూ .. ” జీవన్ రెడ్డి నన్ను గుర్తుపెట్టుకుని ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆయన ఒక కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. ఈ సినిమా హీరోగా ఆకాశ్ పరిచయమయ్యాడు .. ఇప్పుడు తను నా కొడుకులాంటివాడు. ఆకాశ్ కళ్లు బాగుంటాయి .. మంచి హైట్ ఉంటాడు. ఒక హీరోకి ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆకాశ్ తండ్రి పూరి అని చెప్పుకునే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు.

Also Read : అందుకే ‘చోర్ బజార్’ ఒప్పుకున్నాను: నటి అర్చన

RELATED ARTICLES

Most Popular

న్యూస్