Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రోలీగ్ హాకీ: ఇండియాపై అర్జెంటీనా షూటౌట్

ప్రోలీగ్ హాకీ: ఇండియాపై అర్జెంటీనా షూటౌట్

2021-22 FIH Pro League (M): 2021-22 పురుషుల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియాపై అర్జెంటీనా షూటౌట్ విజయం సాధించింది. ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తొలి అర్ధభాగంలో రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి. 38వ నిమిషంలో ఇండియా ఆటగాడు గుర్జాన్ సింగ్ ఫీల్డ్ గోల్ చేసి బోణీ చేశాడు, 45వ నిమిషంలో అర్జెంటీనా ఫీల్డ్ గోల్ చేసింది, 52వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ గోల్ సాధించడం ద్వారా అర్జెంటీనా 2-1 ఆధిక్యం సంపాదించింది. అయితే ఆట మరి కొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా ఇండియా ఆటగాడు మన్ దీప్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేయడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.

అయితే షూటౌట్ లో ఇండియా కేవలం ఒక పాయిట్ మాత్రమే సంపాదించగా అర్జెంటీనా మూడు పాయింట్లు సంపాదించి గెలుపు దక్కించుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్