Friday, October 18, 2024
Homeసినిమా'పుష్ప 2' లో అర్జున్ దాస్..?

‘పుష్ప 2’ లో అర్జున్ దాస్..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. సుకుమార్ అంచనాలకు మించి సినిమా ఉండేలా కథ పై చాన్నాళ్లు కసరత్తు చేశారు. ఇటీవల పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ తక్కువ టైమ్ లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. దీనిని బట్టి పుష్ప 2 పై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మేవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… ఈ సినిమాలో అర్జున్ దాస్ కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అర్జున్ దాస్ అనగానే ముందుగా అందరికీ గుర్తోచ్చేది కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమా. ఆ సినిమాలో విలన్స్ లో ఒకడిగా నటించి తనదైన శైలిలో విలనిజం ప్రదర్శించి మెప్పించాడు. పైకి సింపుల్ గా కనిపిస్తూనే సీరియస్ గా విలనిజం ప్రదర్శించడం అర్జున్ దాస్ స్పెషాలిటీ. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రను పెర్ ఫెక్ట్ అనేలా తెర పైకి తీసుకువస్తాడు. ఇక పుష్ప 2 లో ఏ పాత్ర చేయనున్నాడు అంటే.. రౌడీషీటర్ పాత్ర కోసం అర్జున్ దాస్ ను సుకుమార్ ఎంచుకున్నాడని తెలిసింది.

బన్నీ, అర్జున్ దాస్ కాంబోలో యాక్షన్ సీన్స్ ఉంటాయని.. ఈ సీన్స్ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటాయని తెలిసింది. అలాగే ఫాహిద్ ఫాజిల్, బన్నీ కాంబోలో సీన్స్ కూడా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా సుకుమార్ డిజైన్ చేశారని సమాచారం. ఈ సినిమాతో 1000 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. బాలీవుడ్ లో భారీగా డిమాండ్ ఉండడంతో నిర్మాణ పరంగా ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్