Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2'లో బాలీవుడ్ హీరో?

‘పుష్ప 2’లో బాలీవుడ్ హీరో?

అల్లు అర్జున్,  సుకుమార్ కాంబినేష‌న్లో  రూపొందిన పుష్ప బ్లాక్ బ‌స్ట‌ర్ కావడంతో పుష్ప 2 పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పుష్ప మూవీకి బాలీవుడ్ లో వ‌చ్చిన క్రేజ్ దృష్టిలో పెట్టుకుని పుష్ప 2లో బాలీవుడ్ హీరోతో కీల‌క పాత్ర చేయించాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట సుకుమార్. ఇప్పుడు ఆ బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్ అని టాక్ వినిపిస్తోంది. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌ను డిజైన్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. నిర్మాణ సంస్థ మాత్రం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. గ‌తంలో విజ‌య్ సేతుప‌తి, మ‌నోజ్ బాజ్ పాయ్ న‌టిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత అలాంటిది ఏమీ లేద‌ని నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

అయితే.. బాలీవుడ్ నుంచి ఎవ‌రో ఒక‌రితో కీల‌క పాత్ర చేయించాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ అయ్యార‌ట‌. దీంతో పుష్ప 2 లో న‌టించే బాలీవుడ్ హీరో ఎవరు అనేది ఆస‌క్తిగా మారింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా గురించి పూర్తి వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. మ‌రి.. పుష్ప 2 లో న‌టించే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్