Saturday, January 18, 2025
Homeసినిమాబాలయ్య కోసం బాలీవుడ్ విలన్?

బాలయ్య కోసం బాలీవుడ్ విలన్?

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి‘. మలినేని గోపీచంద్ దర్శకత్వం  వహిస్తున్న ఈ సినిమాను  సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొస్తుంటుంది. అందుచేత వీరసింహారెడ్డి సినిమాకు కూడా సెంటిమెంట్ కలిసొస్తుందని నమ్మకంతో ఉన్నారు బాలయ్య అభిమానులు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లోనే మొదలుపెట్టాలనుకున్నారు కానీ.. వీరసింహారెడ్డి ఆలస్యం కావడంతో ఆ  ప్రభావం దీనిపై పడింది.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచకా ఫినిష్ చేసేస్తున్నారు. బాలయ్య గెటప్ ఎలా వుండాలి అనే దాని మీద మూడు రకాల స్కెచ్ లు వేయించి, వాటికి అనుగుణంగా విగ్ లు ముంబాయిలో చేయిస్తున్నారు.ఇక అసలు విషయానికి

వస్తే.. ఈ సినిమాలో కీలకమైన విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకుంటున్నారని సమాచారం.   ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. బాలయ్య, అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయట. ఇక మిగలింది హీరోయిన్ పాత్ర. కాస్త థర్టీ ప్లస్ లా కనిపించే పాత్ర కావడంతో ఎవరు సెట్ అవుతారు అని డిస్కషన్లు సాగుతున్నాయి. గతంలో బాలయ్య పక్కన నటించిన ఆసిన్ అయితే బాగుంటుంది అని ఆలోచన వచ్చింది కానీ ఆమె నటించేందుకు ఇంట్రస్ట్ చూపించడం లేదని తెలిసింది. మరి… బాలయ్యకు జంటగా ఎవర్ని సెట్ చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్