Sunday, January 19, 2025
HomeTrending Newsఅభ‌య హ‌స్తం మ‌హిళ‌ల్లో అర్హులకీ పెన్ష‌న్లు - మంత్రి ఎర్ర‌బెల్లి

అభ‌య హ‌స్తం మ‌హిళ‌ల్లో అర్హులకీ పెన్ష‌న్లు – మంత్రి ఎర్ర‌బెల్లి

సిఎం కెసిఆర్ పాల‌న‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చిందని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం సిఎం కెసిఆర్ అనేక ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారని, మ‌హిళా దినోత్స‌వ కానుక‌గా రాష్ట్రంలో మ‌హిళా ఆరోగ్య ప‌థ‌కాన్ని తెస్తున్నారని వెల్లడించారు. అభ‌య హ‌స్తం నిధులను మ‌హిళ‌ల‌కే మిత్తీతో స‌హా వాప‌స్ ఇవ్వ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అభ‌య హ‌స్తం మ‌హిళ‌ల్లో అర్హులైన వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు ఇవ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, తొర్రూరు ప‌ట్ట‌ణ కేంద్రంలో ఎర్ర‌బెల్లి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఆ ట్ర‌స్టు చైర్ ప‌ర్స‌న్ ఎర్ర‌బెల్లి ఉషా ద‌యాక‌ర్ రావు అధ్య‌క్ష‌త‌న మంద‌స్తుగా ఘ‌నంగా మ‌హిళా దినోత్స‌వం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లికి భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన మ‌హిళలు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. మేళ తాళాలు, బాణా సంచాలు, బ‌తుక‌మ్మ‌లతో ఎదురేగి, పూలు చ‌ల్లుతూ ఊరేగింపుగా స‌మావేశ స్థ‌లానికి తీసుకెళ్ళారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, మ‌హిళ‌ల అభివృద్ధితోనే దేశ ప్ర‌గ‌తి, పురోగ‌తి జ‌రుగుతుంది. దేశ‌లో ఎక్క‌డా లేని విధంగా డ్వాక్రా సంఘాల బ‌లోపేతం మ‌న రాష్ట్రంలోనే జ‌రిగింది. స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అలాగే అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 8వ తేదీన తొర్రూరుకు వ‌స్తున్న‌ మంత్రి, బి ఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కెటిఆర్ చేతుల మీదుగా కుట్టు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న 500 మందికి కుట్టు మిష‌న్లు, స‌ర్టిఫికేట్ల పంపిణీ చేస్తామ‌న్నారు. అలాగే త‌న‌ను ఇంత‌గా ఆద‌రించి, గెలిపిస్తూ వ‌స్తున్న‌, నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌ల‌ను కాపాడుకునే బాధ్య‌త నాదేన‌ని మంత్రి అన్నారు.

Also Read : Telangana News Andhra Pradesh News

RELATED ARTICLES

Most Popular

న్యూస్