Friday, June 12, 2026
HomeTrending Newsదక్షిణ కోస్తాలోకి ఈశాన్య రుతుపవనాల రాక

దక్షిణ కోస్తాలోకి ఈశాన్య రుతుపవనాల రాక

నైరుతి రుతుపవనాల తిరోగమనం తర్వాత ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు తీర ప్రాంతాలైన పుదుచ్చేరి, కరైకాల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్పం మీద దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయిల్లో ఉన్న ఈశాన్య గాలుల ప్రభావం వల్ల ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. ఇవాళ కింది స్థాయి గాలులు ముఖ్యంగా ఈశాన్య.. తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తున్నాయని వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు మొదలైనట్లు తెలిపింది. తమిళనాడులో వార్షిక వర్షపాతం ఎక్కువ శాతం ఈశాన్య రుతుపవనాల ద్వారానే నమోదవుతుంది. ఈ రుతుపవనాలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు కొనసాగే అవకాశముంది..

తెలంగాణలో తగ్గిన చలి..

మరోవైపు తెలంగాణలో గత వారం రోజులుగా వణికిస్తున్న చలి కాస్త తగ్గుముఖం పట్టినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నవంబర్‌ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular