Party Alliances Pawan : పొత్తులపై పార్టీలో సమిష్టిగా నిర్ణయం తీసుకుంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ విషయంలో పార్టీ అంతా ఒకే తాటిపై ఉందామని సూచించారు. పారీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాము బిజెపి తో పొత్తులో ఉన్నామని… అయితే మరికొన్ని పార్టీలు పొత్తు కోరుకుంటూ ఉండొచ్చని… లేదా మైండ్ గేమ్ అయినా ఆడుతూ ఉండొచ్చని వ్యాఖ్యానించారు. పొత్తుల విషయంలో ప్రతి జనసైనికుడి అభిప్రాయాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో పార్టీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకుందని…. పొత్తుల కంటే ముందు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దామని పార్టీ నేతలకు సూచించారు.
గత ఏడాది కోవిడ్ కారణంగా పార్టీ ఆవిర్భావ సభ జరుపుకొలేక పోయామని, ఈ ఏడాది ఘనంగా జరు పుకుందామని పవన్ పార్టీ శ్రేణులతో అన్నారు. ఈ సభ నిర్వహణకు 5 గురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. మార్చి 14 ఆవిర్భావసభలో 2024 ఎన్నికల గురించి దిశానిర్దేశం చేసుకుందామని, మిగతా పార్టీల మైండ్ గేమ్ లో పడొద్దని హితవు పలికారు.
Also Read : మీడియాకు కులం ముద్ర: బాబు ఆవేదన