Thursday, June 11, 2026
Homeస్పోర్ట్స్ICC Men’s T20 World Cup 2022: జింబాబ్వేపై విండీస్ గెలుపు

ICC Men’s T20 World Cup 2022: జింబాబ్వేపై విండీస్ గెలుపు

టి 20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో జింబాబ్వేపై వెస్టిండీస్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ బౌలర్లు అల్జారీ జోసేఫ్, జేసన్ హోల్డర్ రాణించడంతో లక్ష్య ఛేదనలో జింబాబ్వే విఫలమైంది.

హోబర్ట్ లోని బెల్లిరివ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ  మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జేమ్స్ చార్లెస్-45; రోమన్ పావెల్-28; అకీల్ హోసేన్-23* పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది.  జింబాబ్వే బౌలర్లలో రాజా మూడు; ముజారబ్బాని రెండు; సీన్ విలియమ్స్ ఒక వికెట్ పడగొట్టారు.

తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన జింబాబ్వే  సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమై వరుస వికెట్లు సమర్పించుకుంది. ల్యూక్ జాంగ్వే-29; ఓపెనర్ వెస్లీ మద్వేరే-27; రియాన్ బర్ల్-17… మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు.

విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ నాలుగు; జేసన్ హోల్డర్ మూడు; అకీల్ హోసేన్. ఒబేద్ మెక్ రాయ్, ఓడియన్ స్మిత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 18.2 ఓవర్లలో 122 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ అయ్యింది.

అల్జారీ జోసెఫ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : World Cup 2022 :నమీబియాపై నెదర్లాండ్స్ విజయం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular