Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప మ‌రింత ఆల‌స్యం..?

పుష్ప మ‌రింత ఆల‌స్యం..?

Pushpa the Late: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన పుష్ప‌ టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో సైతం సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పుష్ప-2పై బాలీవుడ్ లో సైతం భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. బాలీవుడ్ నుంచి  పుష్ప 2 రైట్స్ కోసం భారీ ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ట‌. అయితే.. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని మ‌రింత టైమ్ తీసుకుని భారీ లెవ‌ల్లో ఈ సినిమాని రూపొందించాలని మేక‌ర్స్ ఫిక్స్ అయ్యార‌ట‌.

స్క్రిప్ట్  వ‌ర్క్ ఇంకా జ‌రుగుతోంది. అలాగే ఏయే అంశాలు మిక్స్ చేస్తే.. హిందీ బెల్ట్ కు నచ్చుతుంది అనే లెక్కలు వేసి మరీ స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారని తెలుస్తోంది. అందువల్ల అసలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే కనీసం నాలుగు నెలలు పట్టే అవకాశం వుందని స‌మాచారం. ఆత‌ర్వాత‌ సెట్ మీదకు వెళ్తుంది. ఈ లెక్క‌న పుష్ప 2 వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మ్మ‌ర్ కి కూడా వ‌చ్చే ఛాన్స్ లేదు. మ‌రింత ఆల‌స్యంగా.. 2023 సెకండాఫ్ లో పుష్ప 2 రిలీజ్ కానుంద‌నేది తాజా స‌మాచారం.

Also Read : ‘పుష్ప-2’లో కీల‌క పాత్ర‌లో స‌మంత‌?

RELATED ARTICLES

Most Popular

న్యూస్