Sunday, January 19, 2025
Homeసినిమాభీమ్లా నాయ‌క్ సీక్వెల్ పై రానా క్లారిటీ

భీమ్లా నాయ‌క్ సీక్వెల్ పై రానా క్లారిటీ

sequel chances: ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్‌, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డం విశేషం. ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతుంది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు. ఈ పవర్ ఫుల్ రోల్ లో ఆయన పవన్ తో పోటీప‌డి న‌టించి మెప్పించాడు. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఇంత కాలానికి రానాకి సరైన పాత్ర పడిందని.. పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించాడ‌ని అభినందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే టాక్ మొదలైంది. తాజాగా ఇచ్చిన‌ ఇంటర్ వ్యూలో ఇదే ప్రశ్న రానాకు ఎదురైంది.

ఈ ప్ర‌శ్న‌కు రానా స్పందిస్తూ… భీమ్లా నాయ‌క్ సినిమా ఎక్కడ మొదలై.. ఎక్కడ ముగింపు.. తీసుకోవాలో అక్కడే ముగింపు తీసుకుంది. అందుచేత భీమ్లా నాయ‌క్ చిత్రానికి సీక్వెల్ తీసే అవకాశం ఉండకపోవచ్చనేది నా అభిప్రాయం అని చెప్పారు. రానా చెప్పింది నిజ‌మే.. కాబ‌ట్టి భీమ్లా నాయ‌క్ సీక్వెల్ ఉండ‌క‌పోవ‌చ్చు.

Also Read : సమిష్టి కృషి ఫ‌లిత‌మే భీమ్లా నాయ‌క్ సక్సెస్ : రానా

RELATED ARTICLES

Most Popular

న్యూస్