Sunday, January 19, 2025
Homeసినిమాఏప్రిల్ లో అయినా ఖాయమేనా?

ఏప్రిల్ లో అయినా ఖాయమేనా?

Hindi Bheemla: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ భీమ్లా నాయ‌క్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాష‌ణ‌లు అందించ‌డంతో పాటు ఓ పాట రాయ‌డం విశేషం. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోను అలాగే ఓవ‌ర్ సీస్ లోనే రికార్డు స్థాయి క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతుంది.

అయితే.. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయాలి అనుకున్నారు.  ఆ త‌ర్వాత తెలుగులో ఫ‌స్ట్ రిలీజ్ చేసి ఆత‌ర్వాత హిందీలో రిలీజ్ చేస్తామ‌న్నారు. ఈ వారంలో హిందీలో రిలీజ్ చేయాలి అనుకున్నారు. హిందీ వెర్షెన్ ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేశారు. ఇక హిందీలో విడుద‌ల అవుతుంది అనుకుంటే.. ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది అన్నట్టు తెలుస్తుంది. అయితే.. ఇప్పుడు ఈ రిలీజ్ వచ్చే ఏప్రిల్ నెలకి వాయిదా ప‌డింద‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. ఏప్రిల్ లో అయినా భీమ్లా నాయ‌క్ హిందీ వెర్షెన్ రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్