Sunday, January 19, 2025
Homeసినిమాఅఖిల్ 'ఏజెంట్' మళ్లీ వాయిదా?

అఖిల్ ‘ఏజెంట్’ మళ్లీ వాయిదా?

అక్కినేని అఖిల్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ఏజెంట్.  సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో  మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి  కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది.  భారీ చిత్రాల నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

అయితే.. ఈ సినిమాని ఎప్పుడో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూనే ఉంది. ఈ సంవత్సరంలో ఆగష్టులో ఈ సినిమా రిలీజ్ కావల్సివుంది కానీ వాయిదా పడింది. ఆతర్వాత డిసెంబర్ లో ఏజెంట్ మూవీ విడుదల అని ప్రచారం జరిగింది. అయితే.. ఊహించని విధంగా ఏజెంట్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, కోలీవుడ్ స్టార్ విజయ్ వారసుడు చిత్రాలు పోటీపడుతున్నాయి. ఇప్పుడు అఖిల్ ఏజెంట్ మూవీ కూడా సంక్రాంతికి వస్తుందని ప్రకటించడంతో ఆసక్తిగా మారింది.

మేకర్స్ ఏజెంట్ మూవీ రిలీజ్ సంక్రాంతికి అని ప్రకటించినప్పటికీ షూటింగ్ ఇంకా చేయాల్సింది చాలా ఉండడంతో మళ్లీ ఏజెంట్ వాయిదా పడడం ఖాయం అని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు కానీ.. ఏజెంట్ మూవీని ఫిబ్రవరి 20న విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ఏజెంట్ మూవీ రిలీజ్ ఎప్పుడు..? సంక్రాంతికి వస్తుందా..?  ప్రచారంలో ఉన్నట్టుగా ఫిబ్రవరిలో రిలీజ్ కానుందా..?  అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏజెంట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్