Sunday, January 19, 2025
Homeసినిమాకల్యాణ్ రామ్ లాజిక్కు కరెక్టేనా?

కల్యాణ్ రామ్ లాజిక్కు కరెక్టేనా?

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ‘బింబిసార‘ సినిమా రూపొందింది. ఆయన సొంత బ్యానర్లో భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. గతంలో ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో అంజలి జోడీగా .. హీరోగా చేసిన వశిష్ఠ ఈ సినిమాకి దర్శకుడు. ఇంత భారీ బడ్జెట్ సినిమాను ఎంతమాత్రం అనుభవం లేని దర్శకుడికి అప్పగించడం ఎంతవరకు కరెక్ట్? అనే ప్రశ్ననే ప్రతి ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ కి ఎదురైన మొదటి ప్రశ్న. దర్శకుడు కథను చాలా క్లారిటీతో .. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన తీరు నచ్చడం వలన అవకాశం ఇచ్చినట్టు కల్యాణ్ రామ్ చెప్పాడు.

దర్శకుడికి పెద్దగా అనుభవం లేకపోయినా .. అతనికి మంచి టీమ్ ను ఇచ్చినప్పుడు మంచి అవుట్ పుట్ వస్తుందని అన్నాడు. వశిష్ఠకి తాను సీనియర్ టెక్నీషియన్స్ ను ఇవ్వడం వలన  ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించాడని చెప్పాడు. గతంలో తాను పరిచయం చేసిన సురేందర్ రెడ్డి కూడా అప్పటికి కొత్తనే కదా అన్నాడు. ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వకపోతే కొత్త దర్శకులు పరిచయం కారు .. కొత్త టాలెంట్ వెలుగులోకి రాదు అనే మాట నిజమే. నిర్మాతగా తాను లాభాలను సాధించిన సందర్భాలు తక్కువే అయినా, కల్యాణ్ రామ్ ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమే.

అయితే కొత్త దర్శకులను తీసుకునే ప్రాజెక్టులు సాధారణంగా భారీస్థాయిలో ఉండవు. ఆ సినిమాల కంటెంట్ లో ప్రయోగాలు కనిపించవు. వర్కౌట్ కాకపోయినా ఫరవాలేదు .. అనే ఒక భరోసాతోనే వాటిని వదులుతారు. కానీ ఇక్కడ చూస్తే ‘బింబిసార’ చారిత్రక నేపథ్యం కలిగిన కథ. విభిన్నమైన కాస్ట్యూమ్స్ పై .. గ్రాఫిక్స్ పై అవగాహన ఉండవలసిన కథ. చారిత్రక నేపథ్యమే కష్టమనుకుంటే .. దానికి తోడు టైమ్ ట్రావెల్ అంటూ సైన్స్ ఫిక్షన్ ను యాడ్ చేశారు. ఏ రకంగా చూసినా ఇది  కల్యాణ్ రామ్ చేసిన సాహసంతో కూడిన ప్రయోగమే. ఈ నెల 5వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే ఆశిద్దాం.

Also Read : అన్న‌య్య త‌ప్ప మరొకరు చేయలేరు: ఎన్టీఆర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్