Sunday, January 19, 2025
HomeసినిమాWar 2: ప్రభాస్, హృతిక్ ప్రాజెక్ట్ ఏమైంది..?

War 2: ప్రభాస్, హృతిక్ ప్రాజెక్ట్ ఏమైంది..?

ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘ఆదిపురుష్’షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.  జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలు పెట్టనున్నారు. ఇక ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ చేస్తున్నాడు. సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతితో కూడా  ఓ మూవీ చేస్తున్నాడు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ కు  ఒకే చెప్పారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రాబోతోందని వార్తలొచ్చాయి. బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని… ఆయనకు భారీగా అడ్వాన్స్ ఇచ్చారని కూడా టాక్ వచ్చింది. అయితే.. ప్రభాస్, హృతిక్ కాంబోలో వచ్చేది వార్ 2 మూవీ అని ప్రచారం జరిగింది.

అయితే.. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వార్ 2 మూవీని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ డైరెక్టర్ అంటూ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దీంతో ప్రభాస్, హృతిక్ ప్రాజెక్ట్ ఏమైంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ప్రభాస్, హృతిక్ లతో సిద్దార్థ్ ఆనంద్ వేరే ప్రాజెక్టు చేయాలి. వార్ 2 అయితే కాదు. ఊహించని విధంగా వార్ 2 మూవీ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మరి.. ప్రభాస్, హృతిక్ మూవీ గురించి మైత్రీ సంస్థ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్