జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. సోఫియన్ జిల్లాలోని చోటిగాంలో బుధవారం ఓ మెడికల్ షాప్ యజమానిని హత్య చేశారు. మృతుడు కాశ్మీరి హిందువు బాల కిషన్. గత నాలుగు రోజులలో ఉగ్రవాదులు అమాయాక ప్రజలపై దాడులు చేయటం దీంతో నాలుగోది. గ్రామంలోకి వచ్చిన సాయుధులైన వ్యక్తులు హిందువులు ఎక్కడ ఉంటారని విచారణ జరిపి మరి దాడులకు పాల్పడ్డారు. సైనిక బలగాలు ఎప్పటికప్పుడు ముష్కర మూకలను తుదముట్టిస్తున్నా కాశ్మీర్ లోయలో తీవ్రవాదుల ఆగడాలు పెరిగిపోతున్నాయి.
మరోవైపు ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దాళాలు మట్టుబెట్టాయి. సోమవారం సౌత్ కాశ్మీర్, త్రాల్ ప్రాంతంలోని ఝండ్ గ్రామంలో ఉగ్రవాదులు ఓ ఇంటిలో దాగి ఉన్నారని సమచారం అందడంతో సిఆర్ పిఎఫ్, ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు కలిసి సంయుక్తంగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో అప్రమత్తమైన భద్రతా దాళాలు ఉగ్రవాదులపై ఎదరు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఇద్దరు సైనికులు గాయపడ్డారని జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, ఆదివారం సోఫియన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Also Read : జర్నలిస్టు ముసుగులో ఉగ్రవాదం