Sunday, November 3, 2024
HomeTrending Newsగవర్నర్ కు 'గౌరవం'పై సభలో రగడ: ఇద్దరి టిడిపి సభ్యుల సస్పెండ్

గవర్నర్ కు ‘గౌరవం’పై సభలో రగడ: ఇద్దరి టిడిపి సభ్యుల సస్పెండ్

సిఎం జగన్  కోసం గవర్నర్ వెయిట్ చేయాల్సి వచ్చిందని, గవర్నర్ కు తగిన గౌరవం ఇవ్వలేదంటూ టిడిపి చేసిన విమర్శను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పు బట్టారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు నిన్న అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాగతం పలకలేదని, సిఎం కోసం గవర్నర్ ను వెయిట్  చేయించారని ఓ పత్రికలో ప్రచురితమైన వార్తను బుగ్గన సభ దృష్టికి తీసుకు వచ్చారు. పయ్యావుల కేశవ్ మాట్లాడినట్లు ఈ వార్తను ఈనాడు పత్రిక ఈ వార్తను ప్రచురించింది.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మొదలయ్యే ముందు బుగ్గన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సత్య దూరమైన ఆరోపణ కేశవ్ చేశారని, సరైన సమాచారం లేకుండానే ఓ పత్రిక దీన్ని ప్రచురించిందని బుగ్గన తెలిపారు. సిఎం తో పాటు అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ జకియా ఖానుమ్ లు గవర్నర్ కు స్వాగతం పలికిన వీడియోను సభలో ప్రదర్శించారు.

గవర్నర్ గారికి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండడంతో వేడి నీరు అడిగారని, అందుకే స్పీకర్ ఛాంబర్ లోకి తీసుకు వెళ్లి కాసేపు కూర్చో బెట్టి వామ్ వాటర్ ఇచ్చి, వాష్ రూమ్ కు వెళ్లి వచ్చిన తరువాత తాము అందరం కలిసి గవర్నర్ ను సభలోకి తోడ్కొని వచ్చామని బుగ్గన వివరించారు. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని బుగ్గన స్పీకర్ కు విజ్ఞప్తి చేయగా ఆయన పిటిషన్ ఇవ్వాలని సూచించారు.  దీనిపై టిడిపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి స్పీకర్ పోడియం ను  చుట్టుముట్టారు.  దమ్ముంటే తాను మాట్లాడిన వీడియోను ప్రదర్శించాలని కేశవ్ డిమాండ్ చేశారు. అయితే దమ్ము అనే పదం అభ్యంతరమని, అయినా దమ్ము గురించి మాట్లాడే అర్హత వారికి లేదని మంత్రి అంబటి మండిపడ్డారు.

కేశవ్ అలా మాట్లాడితే ఆయనకు, లేకపోతే ఈ వార్త ప్రచురించిన ‘ఈనాడు’ పత్రిక అధినేత రామోజీ రావుకు నోటీసు ఇవ్వాలని మంత్రి సీదిరి అప్పలరాజు స్పీకర్ ను కోరారు.

టిడిపి సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ సెషన్ పూర్తయ్యే వరకూ సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.

Also Read : కోటంరెడ్డి నమ్మక ద్రోహి: అంబటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్