Sunday, January 19, 2025
Homeసినిమా ప్ర‌భాస్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అశ్వ‌నీద‌త్

 ప్ర‌భాస్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అశ్వ‌నీద‌త్

Project K- Next Summer: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ భారీ పిరియాడిక్ మూవీ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది అనుకున్నారు కానీ.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ ఆదిపురుష్‌, స‌లార్ చిత్రాలు కూడా చేస్తున్నారు. ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. స‌లార్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్త‌య్యింది.

అయితే… ఈ సినిమాల కంటే ముందుగా ప్ర‌క‌టించిన ప్రాజెక్ట్ కె మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇది పాన్ వ‌ర‌ల్డ్ మూవీ. ఈ భారీ చిత్రానికి మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సుప్ర‌సిద్ధ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆమ‌ధ్య ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో స్టార్ట్ అయ్యింది. అమితాబ్ బ‌చ్చ‌న్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఆత‌ర్వాత నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ప్రాజెక్ట్ కె రిలీజ్ అవ్వాలంటే.. చాలా సంవ‌త్స‌రాలు వెయిట్ చేయాల్సివుంటుంది అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేయ‌డం జ‌రిగింది. అయితే… తాజాగా ఓ ఇంట‌ర్ వ్యూలో అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ… ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పరిస్థితులు సహకరిస్తే ఈ నెలాఖర్లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్‌లో అమితాబ్, దీపికా పాల్గొనబోతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే సంవ‌త్స‌రం వేసవిలో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తాం అని తెలియ‌చేశారు.

Also Read : ఆ రెండు స్టోరీలు ఒకటేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్