విరాట్ కోహ్లి నేతృత్వంలో ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత క్రికెట్ టెస్ట్ జట్టు ఐదు టెస్టుల సిరీస్ కు ముందు ఒక వామప్ మ్యాచ్ ఆడనుంది. జూలై 20 నుంచి మూడు రోజులపాటు కంట్రీ ఛాంపియన్ షిప్-లెవెన్ జట్టుతో  ఇండియా ఫస్ట్ క్లాసు క్రికెట్ మ్యాచ్ ఆడనుంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటిసి) ఫైనల్ మ్యాచ్ తో పాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు కోహ్లి నేతృత్వంలోని 20 మందితో కూడిన జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన డబ్ల్యూ టి సి లో ఓటమి పాలైన ఇండియా  ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు కొన్ని ఫస్ట్ క్లాసు మ్యాచ్ లు ఆడాలని భావించింది. ఈ మేరకు బిసిసిఐ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించింది. కానీ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఆ అవకాశం లేదని ఇంగ్లాండ్ బోర్డు స్పష్టం చేయడంతో ఇండియా జట్టు నిరాశకు లోనైంది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లు  ఆడేందుకు సమాయాత్తమవుతోంది. ఈ లోగా బిసిసిఐ మరోసారి చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన ఇంగ్లాండ్ బోర్డు ఒక ఫస్ట్ క్లాసు మ్యాచ్ కు ఓకే చెప్పింది. దుర్హం గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *