Saturday, January 18, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కాల్పులు : 9 మంది మృతి

అమెరికాలో కాల్పులు : 9 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ జోష్ లో నిత్యం రద్దీగా ఉండే వ్యాలీ ట్రాన్స్పోర్టేషన్  అథారిటీ కార్యాలయం వద్ద జరిగిన సంఘటనలో మొత్తం 9 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.  మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 36  ఏళ్ళ సిక్కు యువకుడు తేజ్ దీప్ సింగ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మరణించాడు.

శాంతా క్లారా కౌంటీ కి వెళ్ళాల్సిన లైట్ రైల్, బస్సు సర్వీసులన్నీ ఇక్కడినుంచే నడుస్తాయి. మృతులంతా ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ఉద్యోగులని ప్రాథమిక సమాచారం. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాల్పులు ఎందుకు జరిగిందీ ఇంకా తెలియరాలేదని స్థానిక పోలీసు అధికారి రస్సెల్ డేవిస్ వెల్లడించారు. ఈ దుర్ఘటనకు పాల్పడింది 57 ఏళ్ళ శామ్ క్యాసిదీగా గుర్తించారు.  శామ్ అవేశపరుడనీ, సహోద్యోగులను చంపుతానని ఎప్పుడూ చెప్పేవాడని మాజీ భార్య షెల్సియా వెల్లడించింది. కానీ తానూ ఎప్పుడూ అతని మాటలు నమ్మలేదని, చివరకు వారిని చంపి తను కూడా చనిపోయాడని విచారం వ్యక్తం చేసింది. పదేళ్ళ వివాహిక బంధం తరువాత 2005 లోనే తాము విడాకులు తీసుకున్నామని, 13 ఏళ్ళ నుంచి  తామెప్పుడూ కనీసం మాట్లాడుకోలేదని వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్