Saturday, July 27, 2024
HomeTrending Newsనేటి నుంచి ‘ఎమర్జెన్సీ’ బంద్

నేటి నుంచి ‘ఎమర్జెన్సీ’ బంద్

Junior Doctors In Telangana Boycott Emergency Services Except Covid :

రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల (జూడాలు) సమ్మె నేడు రెండో రోజుకు చేరుకుంది. కోవిడ్ మినహా మిగిలిన అన్ని అత్యవసర సేవలను నేటినుంచే బహిష్కరిస్తున్నారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి కెసియార్, మంత్రి కేటియార్ సూచించినప్పటికీ సమ్మె కొనసాగించాలని వారు నిర్ణయం తీసుకున్నారు.

తాము ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నామని, గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని జూడాలు అంటున్నారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందిస్తారనుకుంటే బెదిరించినట్లు మాట్లాడడం సరికాదన్నారు. మంత్రి కేటియార్ వ్యాఖ్యలు తమను బాధించాయని వాపోయారు.

తాము కోరిన నాలుగు డిమాండ్లలో స్టైఫండ్ పెంపుపై నిర్ణయం తీసుకున్నారని, కానీ తాము జనవరి 2020 నుంచి స్టైఫెండ్ ఇవ్వాలని కోరితే 2021 జనవరి నుంచి ఇస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని జూడాలు మండిపడుతున్నారు.  వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు కోవిడ్ వస్తే నిమ్స్ లో చికిత్స, ఇన్సెంటివ్, కోవిడ్ విధుల్లో మరణిస్తే ఎక్స్ గ్రేషియా డిమాండ్లపై స్పందించలేదన్నారు.

కాగా, జూడాలను చర్చలకు ఆహ్వానించామని వైద్య విద్య సంచాలకుడు రమేష్ రెడ్డి వెల్లడించారు.

Also Read : కరోనాలో ‘LAMBDA’ అనే కొత్త వేరియంట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్