Saturday, July 27, 2024
HomeTrending Newsకరోనాలో 'LAMBDA' అనే కొత్త వేరియంట్

కరోనాలో ‘LAMBDA’ అనే కొత్త వేరియంట్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా కొత్త వేరియంట్ వచ్చిందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. lambda అనే కొత్త వేరియంట్ ని 29 దేశాల్లో గుర్తించారు. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు.

మొట్టమొదట ఈ కోవిడ్ వేరియంట్ ని పెరూలో గుర్తించారు. పెరూలో లాంబ్డా ప్రబలంగా ఉంది, ఇక్కడ ఏప్రిల్ 2021 నుండి 81 శాతం COVID-19 కేసులు ఈ వేరియంట్‌తో సంబంధం కలిగి ఉన్నాయని అధికారులు నివేదించారు. ఇది ఇలా ఉండగా చిలీలో, గత 60 రోజుల్లో పరిశీలించిన దాని ప్రకారం 32 శాతం ఉందని కనుగొనగా, బ్రెజిల్‌లో మొట్టమొదట గుర్తించబడిన గామా వేరియంట్‌ ను ఇది అధిగమించింది.

అర్జెంటీనా మరియు ఈక్వెడార్ వంటి ఇతర దేశాలలో కూడా కొత్త వేరియంట్ కేసులు ఉన్నట్టు గుర్తించారు. లాంబ్డా వలన వైరస్ యొక్క శక్తి మరెంత పెరగొచ్చని WHO అంటోంది. అయితే దీనిపై మరింత పరిశోధనలు అవసరమని వైద్య నిపుణులు అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్