Saturday, April 20, 2024
HomeTrending Newsభూములు అమ్మకం పెద్ద స్కామ్ : దాసోజు శ్రవణ్

భూములు అమ్మకం పెద్ద స్కామ్ : దాసోజు శ్రవణ్

సీఎం కేసీఆర్ తన అసమర్ధ పాలనని, దివాలా కోరు తీరుని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రభుత్వ భూములు అమ్మాలనుకోవడం సామాజిక నేరం. నమ్మక ద్రోహమని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు.  ప్రభుత్వ ఆస్తులు కాపాడే ట్రస్టీలా ఉండమని ప్రజలు అధికారం ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం, భూములు అమ్ముకొని, కంచే చేను మేసినట్లుగా వ్యాపార ధోరణితో రియలెస్టేట్ దందా చేయాలని ప్రయత్నిస్తోందని శ్రవణ్ ఆరోపించారు.

కేసీఆర్ ట్రస్టీ మాత్రమే- ఓనర్ కాదని గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రభుత్వ భూములు అమ్మే హక్కు కేసీఆర్ కు లేదు. తెలంగాణ సమాజం కేసీఆర్ చేస్తున్న ఈ ద్రోహాన్ని, దగాని తిప్పికొట్టాలని దాసోజు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం భూములు అమ్మలేదా ? అంటున్న మంత్రి హరీష్ రావు మాటలు వింటుంటే టీఆర్ఎస్ నాయకులందరికీ అల్జీమర్స్ వ్యాధి వచ్చినట్లుందనిపిస్తుందన్నారు శ్రవణ్.

కాపాడలేని భూములని కేసీఆర్ చేతకాని మాటలు చెబుతున్నారు. అసలు భూములు కాపాడలేని వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారన్న శ్రవణ్ ఇది పెద్ద కుట్ర అని ఆరోపించారు. 20వేల కోట్ల రూపాయిలు భూములు వేలం వేసి అమ్మాలనే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. ఈ భూములని టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాస్తున్న పెట్టుబడి దారులకు కట్టేబెట్టడానికి కేసీఆర్ చేస్తున్న పెద్ద కుట్రగా కనిపిస్తుంది. ఇదో పెద్ద కుంభకోణం  అని దాసోజు ఆరోపించారు.

గత ఏడేళ్ళలో సి ఎం కేసీఆర్ ఒక్కసారైనా అఖిల పక్ష సమావేశం నిర్వహించారా అని దాసోజు ప్రశ్నించారు.  కేసీఆర్ తనకి నచ్చినట్లు నియంత పొగడలతో  దగాకోరు పాలన చేస్తున్నారు. 15వేల కోట్ల రూపాయిలు విలువ చేసే భూములు అమ్మాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ .. కనీస చర్చ లేకుండా ఇష్టారాజ్యంగా అమ్మేయాలని చూస్తున్నారని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ సర్కార్ చేస్తున్న అరాచకాలు ప్రశ్నిస్తే కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్ లు దుర్భాషలాడుతున్నారని శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోసల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెడుతున్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ లకు భయపడే పరిస్థితి లేదని ప్రజల పక్షాన నిలబడటానికి రాజకీయాల్లోకి వచ్చాం తప్పా భజన చేయడానికి రాలేదని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్