Thursday, March 28, 2024
Homeసినిమా"పుష్పక విమానం" సాంగ్ విడుదల చేసిన సమంత

“పుష్పక విమానం” సాంగ్ విడుదల చేసిన సమంత

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పుష్పక విమానం”. గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న “పుష్పక విమానం” చిత్రంలోని ఒక్కో పాట శ్రోతల ముందుకొస్తూ ఈ సినిమా మ్యూజికల్ హిట్ అని తేల్చేస్తున్నాయి. ఇప్పటికే ‘సిలకా..’ అనే పాట రిలీజ్ అయి మంచి హిట్ కాగా…తాజాగా ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేశారు.

ఇవాళ (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు సమంత. ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ తనకు బాగా నచ్చిందని చెప్పిన సమంత….హీరో ఆనంద్ దేవరకొండ, నిర్మాత విజయ్ దేవరకొండ సహా “పుష్పక విమానం” ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమాలో కళ్యాణం పాట హీరో హీరోయిన్ల పెళ్లి సందర్భంలో వస్తుంది. సుందర్, మీనాక్షి పెళ్లి వేడుక చూసేందుకు అతిథులంతా ఆనందంగా ఎదురుచూస్తుంటారు. వాళ్ల పెళ్లి కార్యక్రమాలు మంగళ స్నానాలతో మొదలవుతాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అందంగా ముస్తాబయి మండపంలోకి వస్తారు. ఇద్దరి మొహాల్లో తెలియని బిడియం, సిగ్గు ఉట్టిపడుతుండగా..అమ్మలాలో పైడి కొమ్మలాలో… ముద్దుల గుమ్మలాలో సందళ్లు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో.. మోగేటి సన్నాయి మోతల్లలో సాగేటి సంబరాలో…అంటూ కళ్యాణం పాట ప్రారంభమవుతుంది. కళ్యాణం కమనీయం, ఒకటయ్యే వేళనా వైభోగం, కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం..అంటూ సాగుతుంది.

చరణంలో పెళ్లిని అంకెలతో పోల్చూతూ అద్భుతంగా రాశారు గీత రచయిత కాసర్ల శ్యాం. ఏడడుగులేయగా ఈ అగ్ని మీకు సాక్షిగా ఏడు జన్మలా బంధంగా…ఎనిమిది గడపదాటి ఆనందాలు చూడగా..మీ అనుబంధమే బలపడగా..ఇక తొమ్మిది నిండితే నెల..నెమ్మ నెమ్మదిగా తీరెే కల..పది అంకెల్లో సంసారమిలా, పదిలంగా సాగేటి అల.. అని సాగే చరణంలో ఆదర్శ వైవాహిక జీవితాన్ని చూపించారు. ఇక ఈ పాటను మంగ్లీ, సిధ్ శ్రీరామ్ మళ్లీ మళ్లీ వినేలా పాడారు. తన మ్యూజిక్ టాలెంట్ తో కళ్యాణం పాటను మరో హిట్ నెంబర్ చేశారు సంగీత దర్శకుడు రామ్ మిరియాల. ఈ పాటకు అకేషన్ కు తగినట్లు సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చేశారు రఘు మాస్టర్. అలాగే నీల్ సెబాస్టియన్ వేసిన పెళ్లి మండపం సెట్ ఎంతో అందంగా ఉండి ఆకట్టుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్