Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్తొలి సెషన్ వర్షార్పణం:  సవ్యంగా జరిగేనా?

తొలి సెషన్ వర్షార్పణం:  సవ్యంగా జరిగేనా?

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణదేవుదు నీళ్ళు చల్లాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తొలి సెషన్ రద్దయింది. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా వెల్లడించింది.

సౌతాంఫ్టన్‌లో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. జోరుగా కురిసిన వర్షానికి గ్రౌండ్ మొత్తం చిత్తడి అయ్యింది. అనుకున్న సమయానికి ఆట మొదలు పెట్టే అవకాశం లేకపోవడంతో తొలి సెషన్ ను రద్దు చేస్తున్నట్లు మ్యాచ్ రెఫరీ ప్రకటించారు. అధికారులు స్టేడియం లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కాసేపటి తర్వాత వాతావరణ అధికారులు ఇచ్చే సమాచారం బట్టి రెండో సెషన్ కొనసాగే అవకాశం ఉందా లేదా అనేది ప్రకటిస్తారు.

ప్రస్తుతం సౌతాంప్టన్ లో ఉన్న వాతావరణాన్ని పరిశీలిస్తే అసలు ఈ అంతిమ పోరు జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. టెస్ట్ క్రికెట్ కు ఆదరణ పెంచేందుకు ఐసిసి ఓ మంచి ఉద్దేశంతో వేసిన ముందడుగు చివర్లో ఇలా కావడం ప్రేక్షకులకు నిరాశ మిగుల్చుతోంది. ఈ వర్షం జోరు తగ్గకపోతే ఇరు జట్లను సంయుక్త జేతగా ప్రకటించి ప్రైజ్ మనీని రెండు జట్లకూ సమానంగా పంచుతారు.

రెండేళ్ళ క్రితం మొదలైన ఈ టైటిల్ వేట ముగింపు దశకు చేరుకుంది. కరోనా కారణంగా కొన్ని మ్యాచ్ లు రద్దయ్యాయి, దీంతో మెరుగైన రన్ రేట్ తో పాటు పాయిట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ చేరుకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్