Saturday, January 18, 2025
HomeసినిమాAthithi Web Series: హాట్ స్టార్ లో హారర్ థ్రిల్లర్ .. 'అతిథి'

Athithi Web Series: హాట్ స్టార్ లో హారర్ థ్రిల్లర్ .. ‘అతిథి’

హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్లు కొందరుంటారు. భయపడుతూనే చూసేవాళ్లు మరికొందరు ఉంటారు. ఈ తరహా సినిమాలను గుంపుగా చూడటానికి ఆసక్తిని కనబరిచేవాళ్లు ఇంకొందరుంటారు. ఇలా చూసుకుంటే .. కాస్త భయంగా అనిపించినా, ఈ కంటెంట్ పట్ల కుతూహలాన్ని కనబరిచేవారు ఎక్కువమందినే ఉంటారని చెప్పుకోవాలి. అందువల్లనే ఈ తరహా వెబ్ సిరీస్ లను నిర్మించడానికి మేకర్స్ ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా రూపొందిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘అతిథి’.

ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి – అవంతిక మిశ్ర ప్రధానమైన పాత్రలను పోషించారు. సినిమాలలో రీసెంటుగా రీ ఎంట్రీ ఇచ్చిన వేణు, మొదటిసారిగా ఈ వెబ్ సిరీస్ చేశాడు. ఇక నుంచి ఆయన ఈ దిశగా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

సాధారణంగా హీరో ఏదైనా నిర్జన ప్రదేశానికి వెళ్లినప్పుడు .. లేదంటే ఒక పాడుబడిన బంగ్లాలోకి కొత్తగా దిగినప్పుడు అతన్ని దెయ్యం నానా ఇబ్బందులు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సిరీస్ లో హీరోను వెతుక్కుంటూ దెయ్యమే వస్తుంది.  ఆమె చాలా గ్లామరస్ గా కనిపించడంతో హీరోకి ఎలాంటి అనుమానం రాదు. హీరోతో పాటు బంగ్లాలో మకాం పెట్టిన ఆ అమ్మాయి, ఆ తరువాత కాస్త వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. దెయ్యాలను ఎంతమాత్రం నమ్మని హీరో ఏం చేస్తాడు? ఆ దెయ్యం బారి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్