Saturday, January 18, 2025
HomeసినిమాShah Rukh Khan: షారుక్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న అట్లీ!

Shah Rukh Khan: షారుక్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న అట్లీ!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో అట్లీ కుమార్ ఒకరుగా కనిపిస్తాడు. విజయ్ కి భారీ విజయాలను అందించిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది. మాస్ యాక్షన్ పాళ్లు బాగా తెలిసిన దర్శకుడిగా అట్లీ కుమార్ కి మంచి పేరు ఉంది. అయితే ఆయన తనకి తెలిసిన కోలీవుడ్ హీరోలతో సరిపెట్టుకోకుండా, బాలీవుడ్ స్టార్ షారుక్ తో ‘జవాన్’ సినిమాను చేయాలనుకున్నాడు. నిజానికి ఆ సమయంలో షారుక్ వరుస ఫ్లాపులతో సతమతమైపోతున్నాడు. అందువలన ఆయన ఈ ప్రాజెక్టు చేయడానికి ఒక పట్టాన ఒప్పుకోలేదు.

ఎలాగైనా షారుక్ తో సినిమా చేయాలనే పట్టుదలతో రెండేళ్లపాటు ముంబైలోనే అట్లీ కుమార్ మకాం పెట్టాడు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందనే నమ్మకం అట్లీకి కూడా లేదు. అలా ఈ కథపై షారుక్ దృష్టి పడేలా చేసి ..  ఎప్పటికప్పుడు కథపై షారుక్ కి నమ్మకాన్ని పెంచుతూ .. చివరికి తనే ఈ సినిమాను నిర్మిస్తానని షారుక్ అనేలా చేయగలిగాడు. అలా నిర్మితమైన ఈ సినిమా, మొన్ననే థియేటర్లకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున ఈ సినిమా 129 కోట్లకి పైగా వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లను రాబట్టి, కొత్త రికార్డును క్రియేట్ చేసింది. మొత్తానికి అట్లీ అనుకున్నది సాధించాడు. షారుక్ ద్విపాత్రాభినయం .. నయనతార రోల్ … సంజయ్ దత్ .. దీపికా పాత్రలను మలచిన తీరు ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయని అంటున్నారు. ఇక అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందని చెబుతున్నారు. ‘పఠాన్’ తరువాత షారుక్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం చూస్తుంటే, షారుక్ తన పూర్వ వైభవాన్ని అందుకున్నట్టుగానే కనిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్