హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రవేట్ హాస్పటల్ లో దారుణం చోటుచేసుకుంది. వైద్యం పేరుతో 60 అక్షలు వసూలు చేసిన ఆస్పత్రి యాజమాన్యం. వైద్యం పేరుతో లక్షలు వాసులు చేసినా నవజాత శిశువులు మృతి చెందారు. ఏప్రిల్ 24వ తేదిన హాస్పటల్ లో చేరిన సువర్ణ, 12 రోజల తర్వాత కవలలను ప్రసవించింది. పుట్టిన మూడో రోజే చనిపోయిన ఒక పాప. చనిపోయిన పాప చికిత్సకు 19 లక్షల 90 వేలు బిల్లు వేసిన ప్రవేట్ హాస్పటల్ యాజమాన్యం.
ఆ తర్వాత కొద్ది రోజులకు చికిత్స పొందుతూ మరో చిన్నారి మృతి చెందింది. చిన్నారి బాబు చికిత్సకు 33 లక్షల 16 వేలు బిల్లు వేశారు. చికిత్స పేరుతో ఇప్పటి వరకూ 60 లక్షలకు పైగా హాస్పటల్ కు చెల్లించామంటున్న భాదితులు, ప్రవేట్ హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెయిన్ బౌ డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే సంతానాన్ని కోల్పోయామంటున్న తల్లి తండ్రులు సువర్ణ, రఘునాథ్ రెడ్డి.