Sunday, January 19, 2025
Homeసినిమా'కొరమీను' ఏ ఒక్కరినీ నిరాశ పరచదు: ఆనంద్ రవి

‘కొరమీను’ ఏ ఒక్కరినీ నిరాశ పరచదు: ఆనంద్ రవి

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తోన్న‌ సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరమైన అంశంతో మడిపడిన మూవీ ఇది. ఓ డ్రైవర్, అహంకారంతో కూడిన, బాగా డబున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు … ఈ మూడు క్యారెక్టర్స్ మధ్య నడిచే చిత్రమే ‘కొరమీను’. డిసెంబర్ 31న సినిమా రిలీజ్ అవుతుంది. పాటలు మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి. కొరమీను’ చిత్రాన్ని గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మ‌హేశ్వ‌ర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో డిసెంబ‌ర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం కొర‌మీను టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.

ప‌రిమిత‌మైన బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న సినిమాల‌కు సంబంధిచి కొర‌మీను, ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా టీమ్స్ క‌లిసి ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకొచ్చారు. ఒక‌రోజు ముందుగా వ‌స్తున్న ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్ మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన త‌మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొర‌మీను టీమ్‌ను ఆహ్వానించగా హీరో ఆనంద్ ర‌వి, హీరోయిన్ కిశోరి వెళ్లి టీమ్‌కు విషెష్ తెలియ‌జేశారు. అలాగే బుధ‌వారం జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ టీమ్‌ని కొర‌మీను టీమ్ ఆహ్వానించగా.. సోహైల్‌, హీరోయిన్ మోక్ష హాజ‌రై త‌మ విషెష్‌ను అందించారు. ఇలా ఒక‌రికొక‌రు స‌పోర్ట్ అందించుకుంటూ ముందుకు సాగే స‌రికొత్త ట్రెండ్‌కి ఈ రెండు సినిమా యూనిట్స్ ఆహ్వానం ప‌లికాయి. దీన్ని ఇలాగే అంద‌రూ కొన‌సాగిస్తే బావుంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. ‘ఇక్కడకు వచ్చి ప్రమోట్ చేసిన లక్కీ లక్ష్మణ్ టీంకు థాంక్స్. డిసెంబర్ 30న లక్కీ లక్ష్మణ్ వస్తోంది. డిసెంబర్ 31న మా కొరమీను రాబోతోంది. మందుబాబుల దినోత్సవం నాడు మా సినిమా రాబోతోంది. ఈ మూవీ ఏ ఒక్కరినీ డిసప్పాయింట్ చేయదు. ఇంతకు మించి నేనేమీ ఇప్పుడు చెప్పను. ఆ తరువాత మాట్లాడుకుందాం అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్