Saturday, April 20, 2024
Homeస్పోర్ట్స్ICC T20 World Cup: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా రద్దయ్యింది

ICC T20 World Cup: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా రద్దయ్యింది

మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య నేడు జరగాల్సిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్  కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీనితో కలిపి టాస్ వేయకుండా రద్దయిన మ్యాచ్ ల సంఖ్య మూడుకు చేరింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా  మధ్యలోనే ఆగిపోగా, ఇంగ్లాండ్- ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో సైతం వర్షం కారణంగా ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు.

ఇదే  గ్రౌండ్ లో బంగ్లాదేశ్ – ఐర్లాండ్ మధ్య భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం జరగాల్సిన మ్యాచ్ కూ ఇదే పరిస్థితి ఎదురైంది.

వర్షాకాలంలో ఆస్ట్రేలియాలో ఈ టోర్నీ నిర్వహించడం పట్ల క్రికెట్ ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ICC T20 World Cup: మరో మ్యాచ్ వర్షార్పణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్