Friday, April 19, 2024
Homeస్పోర్ట్స్రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మృతి

రోడ్డు ప్రమాదంలో సైమండ్స్ మృతి

Symonds no more: సుప్రసిద్ధ క్రికెట్ ప్లేయర్, ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ అండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు, అతని వయస్సు 46 సంవత్సరాలు. టౌన్స్ విల్లె కు 50 కిలోమీటర్ల సమీపంలో గత అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
1998లో ఆసీస్ జాతీయ జట్టుకు తొలిసారి ఆడిన సైమండ్స్ 2009  వరకూ సేవలందించాడు. అతని మొదటి వన్డే, చివరి వన్డే పాకిస్తాన్ తోనే కావడం గమనార్హం. 2004లో శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్, 2008లో సౌతాఫ్రికాతో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

198 వన్డే ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్ లు ఆడిన సైమండ్స్ 5,088 పరుగులు చేశాడు, 133  వికెట్లు సాధించాడు,

26  అంతర్జాతీయ  టెస్టు మ్యాచ్ లు ఆడి 1642 పరుగులు సాధించాడు.

ఐపీఎల్ మొదటి, మూడవ సీజన్లలో డెక్కన్ చార్జెర్స్ కు ఆడిన  సైమండ్స్ నాలుగో సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ తో బిజీగా ఉండడంతో రెండో సీజన్లో పాల్గొనలేదు.

తన క్రీడా జీవితంలో ఎన్నోసార్లు జాతి వివక్ష ఎదుర్కొన్న సైమండ్స్… తన ప్రవర్తనతో  కూడా  పలు వివాదాల్లో   చిక్కుకున్నాడు.

సైమండ్స్ మృతిపట్ల క్రికెట్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్