యాషెస్ రెండో టెస్ట్ : తడబడ్డ ఇంగ్లాండ్

England 236 Allout:
పరుగుల వేటలో ఇంగ్లాండ్ మరోసారి తడబడింది. యాషెస్ సిరీస్ రెండో టెస్ట్  తొలి ఇన్నింగ్స్ లో 236 పరుగులకే ఆలౌటై కష్టాల్లో పడింది. 2 వికెట్లకు 17 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేడు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్  మూడో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో ఇన్నింగ్స్ గాడిలో పడ్డట్లు అనిపించింది. కెప్టెన్ రూట్-60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే డేవిడ్ మలాన్(80) కూడా పెవిలియన్ చేరాడు. మిగిలిన వారిలో బెన్ స్టోక్స్-34; క్రిస్ ఓక్స్- 24 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీనితో 236 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ నాలుగు, లియాన్ మూడు, గ్రీన్ రెండు, నేసేర్ ఒక వికెట్ సాధించారు.

తొలి ఇన్నింగ్స్ లో 237  పరుగుల ఆధిక్యంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. నేడు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. వార్నర్ 13 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. మార్కస్ హారిస్-21; మైఖేల్ నేసేర్-2 పరుగులతోను క్రీజులో ఉన్నారు. మొత్తంగా ఆసీస్ 282 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Also Read : యాషెస్ రెండో టెస్ట్: ఆసీస్ ఆధిపత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *