Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఉమెన్ యాషెస్ లో ఆసీస్ బోణీ

ఉమెన్ యాషెస్ లో ఆసీస్ బోణీ

Women Ashes: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ గతవారం ముగిసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా 4-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. నేడు మహిళల యాషెస్ సిరీస్ ఆరంభమైంది. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య మూడు టి 20లు, ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

అడిలైడ్ లోని ఓవల్ మైదానంలో నేడు జరిగిన మొదటి టి 20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ టీం లో వ్యాట్-70; సైవర్-32; బ్యూమంట్-30 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20  ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో తహ్లియా మెక్ గ్రాత్ మూడు, అలన కింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆస్ట్రేలియా 170 పరుగుల లక్ష్యాన్ని 17 ఓవర్లోనే  కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సాధించింది. ఓపెనర్ అలేస్సా హీలే ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్, కెప్టెన్ మెగ్ లానింగ్-64 (44 బంతుల్లో 8 ఫోర్లు); తహ్లియా మెక్ గ్రాత్-91 (49 బంతుల్లో 13 ఫోర్లు, 1సిక్సర్)  పరుగులు చేసి అజేయంగా నిలిచారు.

బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిన తహ్లియా మెక్ గ్రాత్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నారు.

Also Read : తొలి వన్డేలో సౌతాఫ్రికా విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్