ఇండియా – ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో చివరి మ్యాచ్ లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ గెల్చుకున్న ఆసీస్ జట్టు ఈ గెలుపుతో 4-1 ఆధిక్యం సంపాదించింది.
ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ కోల్పోయి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టులో గార్డ్ నర్-66 (32 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్ ); గ్రేస్ హారిస్ -64 (35 బంతుల్లో 6 ఫోర్లు; 4 సిక్సర్లు) పరుగులతో ఐదో వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి నాటౌట్ గా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు కెప్టెన్ తహిలా మెక్ గ్రాత్-26; పెర్రీ-18 పరుగులతో రాణించారు.
ఇండియా బౌలర్లలో అంజలి శర్వాణి, దీప్తి శర్మ, షఫాలీ వర్మ, దేవికా వైద్య తలా ఒక వికెట్ సాధించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా… ఆసీస్ బౌలర్ హిథర్ గ్రాహమ్ హ్యాట్రిక్ దెబ్బకు 142 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో దీప్తి శర్మ ఒక్కరే 53పరుగులతో రాణించగా, హర్లీన్ డియోల్ 24రన్స్ తో ఫర్వాలేదనిపించింది. ఇన్నింగ్స్ చివరి బంతికి దీప్తి ఔటయ్యింది.
ఆసీస్ బౌలర్లలో గ్రాహమ్ 4; ఆష్లీ గార్డ్ నర్ 2; డార్సీ బ్రౌన్, తహీలా మెక్ గ్రాత్, సతర్లాండ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
గార్డ్ నర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు; ప్లేయర్ అఫ్ ద సిరీస్ కూడా దక్కింది.
Also Read : India Women Vs Australia Women: టి20 సిరీస్ ఆసీస్ దే!