Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Tennis: ఆస్ట్రేలియన్ ఓపెన్ చివరిది: సానియా గుడ్ బై

Tennis: ఆస్ట్రేలియన్ ఓపెన్ చివరిది: సానియా గుడ్ బై

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు ఆ దేశం చేరుకున్న సానియా ఇదే తన కెరీర్ లో చివరి టోర్నమెంట్ అని వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల లేఖను ఆమె ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది. ఇందులో సానియా టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించింది.

ఇప్పటితో అంతా ముగిసిపోయినట్లు కాదని ఓ సరికొత్త జీవితానికి ఇది నాంది అవుతుందని, ఇప్పటి వరకూ తన కుమారుడితో ఎక్కువ సమయం గడపలేకపోయానని, ఇకపై ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుందన్నారు.

18 ఏళ్ళ క్రితం తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడానని, ఇప్పుడు చివరిది ఆడుతున్నానని.. నాడు దుబాయ్ టోర్నీలో ఆడిన సంగతులనుకూడా ఆమె నెమరువేసుకున్నారు.ఈనెల 16 న ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలు కానుంది.

ఇన్నేళ్ళ తన కెరీర్ లో సహకరించిన కోచ్ లు, తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్