Saturday, January 18, 2025
HomeTrending Newsపాపికొండలు యాత్ర పునః ప్రారంభం

పాపికొండలు యాత్ర పునః ప్రారంభం

Avanthi Flag Off For Papikondalu Yatra Through River Godavari :

పోలవరం ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. పాపికొండలు బోటింగ్ విహరయాత్రను మంత్రి పునః ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలోని గండి పోచమ్మ ఆలయం వద్ద ఉన్న బోట్ పాయింట్ వద్ద పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లను జెండా ఊపి యత్ర ప్రారంభించారు.

ప్రభుత్వానికి చెందిన రెండు బోట్లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన మరో 9 బోట్లకు ప్రస్తుతం గోదావరి నదిలో విహార యత్రకు అనుమతులు ఇచ్చామని మంత్రి చెప్పారు. సిఎం జగన్ ఆదేశాల ప్రకారం తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్స్ పర్యవేక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, టూరిజం శాఖల అనుసంధానంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని బోటింగ్ ప్రారంభించామన్నారు. ఎప్పటికప్పుడు సాటిలైట్ సైటీమ్ ద్వారా అధికారుల పర్యవేక్షణ మోనేటరింగ్ ఉంటుందని అన్నారు, టూరిజం బోట్లతోపాటు ఒక ఎస్కార్ట్ బోట్, సాటిలైట్ ఫోన్ సౌకర్యం, జీపీఎస్ ద్వారా బోటింగ్ పర్యవేక్షిస్తూ బోటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామని అవంతి వివరించారు.

రూ.1250 టికెట్ తో కూడిన ఈ విహారయత్రలో టిఫిన్, భోజనం, స్నాక్స్ అందిస్తారని మంత్రి అన్నారు. త్వరలోనే మిగిలిన బొట్లకు పర్మిషన్లు ఇస్తామని మంత్రి గారు అన్నారు. రోడ్డు సౌకర్యం కూడా మెరుగుపరచి టూరిస్టులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బొట్లలో టూరిస్టులతో మాట్లాడారు. టూర్ మొత్తం లైఫ్ జాకెట్లు ధరించాలని.. విహారయత్రను విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ అరిమండ వరప్రసాద రావు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, టూరిజం, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్