Saturday, January 18, 2025
HomeTrending Newsఅయ్యన్న పాత్రుడి అరెస్ట్

అయ్యన్న పాత్రుడి అరెస్ట్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను కాసేపట్లో ఏలూరు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.  అయ్యన్నతోపాటు ఆయన కుమారుడు రాజేష్ ను కూడా అరెస్టు చేశారు.

ఇంటి పక్కన కాలువను ఆక్రమించి ప్రహరీ గోడ కట్టారని గతంలో అయ్యన్నపై కేసు నమోదు చేసి ఇంటి ప్రహరీ గోడను కూల్చి వేశారు. అయితే ఈ స్థలం తనదే అని అయ్యన్న కోర్టుకు కొన్ని పత్రాలు సమర్పించారు. అయన కోర్టుకు సమర్పించిన పత్రాలు ఫోర్జరీ అంటూ సిఐసి కేసు నమోదు చేసింది.  ఈ కేసుకు సంబంధించే ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్