Wednesday, September 25, 2024
HomeTrending Newsఆగ‌స్టు 5 నుంచి చారిత్రక ప్రదేశాలకు ప్రవేశం ఉచితం

ఆగ‌స్టు 5 నుంచి చారిత్రక ప్రదేశాలకు ప్రవేశం ఉచితం

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏండ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ముమ్మ‌రంగా ఏర్పాట్లు కొన‌సాగుతోన్న విష‌యం విదిత‌మే. అయితే ఆగ‌స్టు 5 నుంచి 15వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలో భార‌త పురావ‌స్తు శాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతోన్న అన్ని మ్యూజియంలు, ఇత‌ర చారిత్రక, ప‌ర్యాట‌క ప్రాంతాల్లో ఉచిత ప్ర‌వేశం క‌ల్పిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స్వ‌దేశీయులతో పాటు విదేశీయుల నుంచి ఎలాంటి ప్ర‌వేశ రుసుము వ‌సూలు చేయ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. గోల్కొండ‌, చార్మినార్‌తో పాటు ఇత‌ర సంద‌ర్శ‌న ప్ర‌దేశాల‌ను ప‌ర్యాట‌కులు ఉచితంగా చూడొచ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.

Also Read : పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్